ASR: భారతీయులది సనాతన ధర్మమని ఆర్ఎస్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బీఎంఎస్ లోవరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కొయ్యూరు మండలంలోని శరభన్నపాలెంలో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. లోవరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. భారతీయులంతా సంఘటితంగా మెలగాలని సూచించారు. ఎందరో ప్రాణ త్యాగాలతో సాధించిన స్వాతంత్య్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.