W.G: తణుకు మండలం పైడిపర్రు కాలువలో ఆదివారం మధ్యాహ్నం 10ఏళ్ల బాలుడు గల్లంతయ్యాడు. సుమారు పదిమంది కాలువలో దిగి ఆడుకుంటూ ఉండగా వీరిలో గుర్తుతెలియని బాలుడు గల్లంతయ్యాడు. స్థానికులు కాలువలోకి దిగి గాలించినప్పటికీ ఆచూకీ లభ్యం కాకపోవడంతో తణుకు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.