సత్యసాయి: రొద్దం మండలంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత సోమవారం పర్యటించనున్నట్లు మండల మేజర్ పంచాయతీ కన్వీనర్ చిరంజీవి తెలిపారు. రొద్దం మండలం కేంద్రంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.