MLG: ఏటూరునాగారం(M) దొడ్ల గ్రామంలోని జంపన్నవాగు తగ్గుముఖం పట్టినప్పటికీ రవాణా కష్టాలు తప్పడం లేదు. అత్యవసర పనులు, అనారోగ్య సమస్యలు, వ్యవసాయ పనుల నిమిత్తం మండల కేంద్రానికి వెళ్లిన ముంపు గ్రామస్థులు మోకాలి లోతు నీటిలో నడిచి స్వగ్రామం చేరుకోవాల్సి వస్తోంది. వాగు తగ్గడంతో పడవ నిర్వాహకులు వెళ్లిపోయారు. ఈ సమస్య పై అధికారులు స్పందించాలని ఇవాళ కోరారు.