కడప నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న లబ్ధిదారులకు రూ. 8,48,265 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ రెడ్డెప్పగారి మాధవి పాల్గొన్ని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజల పక్షాన నిలుస్తుందన్నారు. C.M చంద్రబాబు ప్రజాహిత పాలన వల్లే ఈ సహాయం సత్వరంగా అందిందని తెలిపారు.