KKD: జీఎస్టీ 2.0పై రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబి బృందం ఆదివారం విస్తృత ప్రచారం నిర్వహించింది. గైగోలుపాడు నుంచి సర్పవరం జంక్షన్ వరకు భారీగా కార్యకర్తలతో కలిసి వెళ్లి ఏయే వస్తువులపై ఎంత జీఎస్టీ తగ్గిందో వివరించారు. కరపత్రాలు పంపిణీ చేసి, ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమాల గురించి వివరించారు.