PLD: నరసరావుపేటలోని శ్రీ వీరాంజనేయ సహిత యోగానంద లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణం కోసం నరసరావుపేటకు చెందిన శివకుమార్, లక్ష్మీ దంపతులు రూ.3 లక్షల విరాళం ఇచ్చారు. ఈ మేరకు ఇవాళ వారు ఆలయ కమిటీ సభ్యులకు ఈ నగదును అందజేశారు. ఆలయంలో 16 రాతి స్తంభాలు కలిగిన ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ పునర్నిర్మాణానికి భక్తులు మరింత సహకరించాలాని వారు విజ్ఞప్తి చేశారు.