SKLM: జలుమూరు మండలం బసివాడ గ్రామం వద్ద ఉన్న రైల్వే అండర్ పాసేజ్ వద్ద నిత్యం మురుగునీరు నిలిచిపోవడం, నాచు పట్టడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీని కారణంగా రహదారిపై వాహనాలు జారిపడి ప్రమాదాలు జరుగుతున్నాయని బాధితులు వాపోతున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.