VSP: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి నిత్య కల్యాణం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపజేసి అర్చకులు పాంచరాత్రాగమశాస్త్ర విధానంలో విశ్వక్సేనారాధన, కంకణధారణ, మాంగళ్యధారణ, తలంబ్రాల కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రపుష్పం అనంతరం భక్తులకు వేదాశీర్వచనాలు, ప్రసాదాలు అందజేశారు.