AP: 2047 నాటికి విశాఖ ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మారనుందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులను ఆహ్వానిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. ఏ రాష్ట్రానికైనా రాజధాని ఒక్కటే కానీ, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్నారు. పెట్టుబడుల సాధనలో చరిత్ర తిరగరాస్తామనే నమ్మకం ఉందన్నారు. రాష్ట్రానికి 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాబోతున్నాయని చెప్పారు.