ఫిమేల్ జెనిటల్ మ్యూటిలేషన్(FGM) అంశం సుప్రీంకోర్టులో చర్చకు వచ్చింది. FGM అనేది అనాగరికం అని సీజేఐ జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం FGM వివాదం SCలో తొమ్మిది మంది జడ్జిల ధర్మాసనం ముందు విచారణలో ఉంది. మహిళల శరీర భాగాలను కత్తిరించే ఈ పద్ధతిపై SC వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ అనాగరిక పద్ధతిని పూర్తిగా అడ్డుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.