NTR: జగన్నాధపురం గ్రామంలో గ్రామ మాజీ సర్పంచ్, పార్టీ సీనియర్ నాయకులు, బూరుగ బాలస్వామి మరణించారు. ఈ సమాచారం తెలుసుకున్న, నందిగామ మాజీ శాసనసభ్యులు మొండితోక జగన్మోహనరావు, పార్టీ నాయకులతో కలిసి వారి నివాసంలో ఆయన భౌతిక కాయానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు.