BHPL: జిల్లా వ్యాప్తంగా అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని BHPL SP కిరణ్ ఖారే హెచ్చరించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆదివారం SP మాట్లాడుతూ.. చట్టాన్ని అతిక్రమించి, అనుమతి పత్రాలు లేకుండా ఇసుక రవాణా చేస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఇసుక రవాణాకు స్థానిక MROల నుంచి అనుమతి తీసుకోవాలని SP సూచించారు.