SRPT: సూర్యాపేటలో రూ.1.30 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న జిల్లా గ్రంథాలయ భవన స్థలాన్ని ఎమ్మెల్యే పద్మావతి శనివారం సాయంత్రం పరిశీలించారు. నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, నాణ్యత పాటించాలని ఎమ్మెల్యే సంబంధిత అధికారులను ఆదేశించారు. భవన నిర్మాణం త్వరగా పూర్తిచేసి ప్రజలకు గ్రంథాలయాన్ని అందుబాటులోకి తెస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు.