HNK: దామెర మండలం ఊరుగొండ గ్రామానికి చెందిన మహమ్మద్ అహ్మద్ గ్రూప్-1లో డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యారు. ఆదివారం ఆయన పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ధర్మారెడ్డి అహ్మద్‌ను శాలువతో సత్కరించి, ప్రజలకు సేవలందించి, పరకాల నియోజకవర్గానికి , గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని శుభాశీస్సులు అందించారు.