KKD: కేంద్రపాలిత ప్రాంతం యానంలో శనివారం హత్య జరిగింది. సినిమా హాల్ సెంటర్లో గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేయడంతో కాజులూరు మండలానికి చెందిన తిపిరిశెట్టి నారాయణ స్వామి (33) తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.