ఏలూరు నగరంలోని ఏకేజీ సెంటర్, చింత చెట్టు సెంటర్, తూర్పు వీధి చాటపర్రు రోడ్డు ఆంజనేయస్వామి గుడి వద్ద గంగానమ్మ సంబరాలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సంబరాలలో ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అలాగే భక్తులు అమ్మవారికి పూజలు, అభిషేకాలను నిర్వహించి బోనాలు సమర్పించుకున్నారు.