W.G: ఉండి వద్ద రైల్వే ఆర్ఓబీ పనులు జరుగుతున్నందున ప్రధాన మార్గాన్ని మూసివేశారు. దీంతో ఆకివీడు మీదుగా భీమవరం వెళ్లే ప్రయాణికుల కోసం కుప్పనపూడి, కాళ్ల మీదుగా దారి మళ్లింపు ఏర్పాటు చేశారు. ఈ నెల 17వ తేదీ వరకు వాహనాలను ఈ మార్గం గుండానే పంపిస్తున్నారు. మళ్లింపు కారణంగా భీమవరం వెళ్లే ప్రయాణికులు కొంత దూరం అదనంగా ప్రయాణించాల్సి రావడంతో ఇబ్బందులు పడుతున్నారు.