MBNR: జిల్లాలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ ఆధ్వర్యంలో శనివారం బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన కార్యకర్తలు భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వారికి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చేరిన నాయకులు మాట్లాడుతూ.. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు.