NLR: కె.వి.ఆర్ పెట్రోల్ బంకు సమీపంలో ఓ హోటల్లో శనివారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకున్నది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల హోటల్లోని ఒక గది అగ్నికి ఆహుతి అయింది. ఈ విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే వెళ్లి మంటలను ఆర్పి వేశారు. దాదాపుగా రెండు లక్షల మేర ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.