పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళ చిత్రం “తంగళన్”లో యాక్ట్ చేస్తున్న నటుడు చియాన్ విక్రమ్ రిహార్సల్స్ చేస్తున్న క్రమంలో అనుకోకుండా కింద పడ్డారు. దీంతో ఆయన పక్కటెముక విరిగిందని అతని బృందం ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో విక్రమ్ ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా..ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో చియాన్ ను కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది.
ఇటీవల “పొన్నియిన్ సెల్వన్ 2″తో విక్రమ్ విజయం సాధించినప్పటికీ, గాయం కారణంగా కొంతకాలం “తంగళన్” టీమ్ నుంచి దూరంగా ఉండనున్నారు. ఇంతలోనే ఇలా జరగడంపై చియాన్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో విక్రమ్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా ట్విట్లతోపాటు కామెంట్లు చేస్తున్నారు.