KRNL: పత్తికొండ మండలం హోసూరు గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు శనివారం సీజ్ చేశారు. అరుణారెడ్డి అనే మహిళ ఇంట్లో పది బస్తాల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. గతంలో అక్టోబర్ 1న కూడా ఈ మహిళ 21.5 క్వింటాళ్ల రేషన్ బియ్యంతో పట్టుబడినట్లు అధికారులు గుర్తించారు. పీడీ యాక్టు కింద కేసు నమోదు చేయాలని రెవెన్యూ శాఖ యోచిస్తోంది.