HYD: నవంబర్ 11న జరగనున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు రేపటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల అధికారి కర్ణన్ తెలిపారు. గతంలో లేని విధంగా ఈసారి ఓటర్ స్లిప్లోనే ఓటర్ సీరియల్ నెంబర్ కూడా ఉంటుందని, దీంతో పోలింగ్ కేంద్రంలోని సిబ్బంది సైతం ఓటర్లను వెంటనే గుర్తించగలుగుతారన్నారు.