E.G: కోరుకొండ శ్రీ రంగనాథ స్వామి ఆలయాన్ని పరిరక్షించి, పూర్వ వైభవం తీసుకువస్తామని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పేర్కొన్నారు. శనివారం కోరుకొండలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయాన్ని ఆలయం అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ నెల 24న శ్రీ రంగనాథ స్వామి ఆలయం పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.