ELR: పెదవేగి మండలం కొప్పాక గ్రామంలో శనివారం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో నూతనంగా నిర్మించనున్న సబ్ స్టేషన్కు భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ₹.49 కోట్ల వ్యయంతో 220/133 కె వి, 133/33 కెవి సబ్ స్టేషన్లను నిర్మించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.