MDCL: బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలో అక్టోబర్ 12న పల్స్ పోలియో కార్యక్రమం జరగనుంది. చెంగిచెర్లలో రెండు, బోడుప్పల్ పరిధిలో 12 కేంద్రాల్లో నిర్వహిస్తామని తెలిపారు. బోడుప్పల్ పరిధిలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పల్స్ పోలియో కార్యక్రమం ఉంటుందని కమిషనర్ శైలజ పేర్కొన్నారు. పుట్టిన నుంచి ఐదేళ్ల వరకు ఉన్న వారికి ఈ పల్స్ పోలియో కార్యక్రమం ఉంటుంది.