VKB: వికారాబాద్ మండలం సర్పన్ పల్లి గ్రామస్తులు కీలక తీర్మానం చేశారు. గ్రామంలో మద్యం అమ్మకూడదని నిర్ణయించుకున్నారు. యువత మద్యం తాగి పాడైపోతున్నారని పేర్కొన్నారు. ఊరు బాగుంటేనే మనమందరం బాగుంటామన్నారు. గ్రామంలో బెల్ట్ షాపులు, మద్యం షాపులు లేకుండా చూడాలని అధికారులకు తీర్మానం కాపీ అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులందరూ పాల్గొన్నారు.