KRNL: మద్యం తాగి బస్సు నడిపిన ప్రైవేటు ట్రావెల్ డ్రైవర్‌కు ఎమ్మిగనూరు న్యాయమూర్తి జైలు శిక్ష విధించినట్లు శుక్రవారం సీఐ రామానుజులు పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం రాఘవేంద్ర కూడలిలో ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు డ్రైవర్ మద్యం తాగి బీభత్సం సృష్టించారు. డ్రైవర్‌ను ఎమ్మిగనూరు కోర్టులో హాజరుపరచగా కోర్టు 15 రోజుల జైలు శిక్ష విధించినట్లు ఆయన తెలిపారు.