TPT: ఏనుగుల దాడిలో పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. ఇందులో భాగంగా రేణిగుంట మండలం మామండూరు గ్రామంలో ఏనుగుల దాడిలో పంటనష్టం జరిగిన రైతులు 16 మందికి రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.2,25,500 నష్ట పరిహారం మంజూరు చేసింది. మంజూరు అయిన చెక్కులను శుక్రవారం రైతులకు ఎమ్మెల్యే అందజేశారు.