KMR: బీబీపేట్ మండలంలోని అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు చెల్లిస్తున్నట్లు ఎంపీడీవో పూర్ణ చంద్రోదయ కుమార్ చెప్పారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు నిర్మాణాలు వేగవంతం చేయాలని సూచించారు. ప్రతి సోమవారం ఇండ్ల నిర్మాణాన్ని బట్టి లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామన్నారు.