కరీంనగర్ రేకుర్తిలోని ఇందిరా నగర్, బుడగ జంగాల కాలనీలో నిన్న ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ కాపీలను సుడా ఛైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. పలు ఇళ్లకు శంకుస్థాపన చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ పథకం ద్వారా నిరుపేదలకు సొంత ఇంటి స్వప్నం నెరవేరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.