RR: షాద్‌నగర్ నియోజకవర్గం నందిగామ మండలం రంగాపూర్ గ్రామంలోని డంపింగ్ యార్డ్‌ను డీపీఓ సురేష్ మోహన్ ఆకస్మికంగా పరిశీలించారు. తడి, పొడి చెత్తను వేరు చేసే ప్రక్రియలో భాగంగా నిర్మించిన షెడ్ల దుస్థితిపై ఆరా తీశారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రాముఖ్యత ఇవ్వాలని, వారం రోజుల్లో అన్ని గ్రామాల్లో ఉన్న షెడ్లను ఉపయోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు.