నల్గొండలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో బ్యూటిషన్ కోర్సులో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు మహిళా శిశు వికాస కేంద్రం జిల్లా మేనేజర్ ఏ అనిత తెలిపారు. 8వ తరగతి పాస్ లేదా పెయిల్ అయిన జనరల్ మహిళలు, ఒంటరి మహిళ, స్కూల్ మధ్యలో ఆపేసిన మహిళలు, డిజేబుల్ మహిళలు ఈనెల 15 లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.