ADB: ఉట్నూర్ కోర్టులో పనిచేస్తున్న న్యాయవాదులు విధులను బహిష్కరించారు. న్యాయవాది బానోత్ జగన్ నాయక్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపి బెయిల్ విషయంలో పోలీసుల వైఖరిని నిరసిస్తూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి.బాపురెడ్డి పాల్గొన్నారు.