BDK: మణుగూరు- కమలాపురం రహదారిపై అడ్డంగా రెండు వైపులా ఇసుక లారీలు ఆపడంతో ప్రయాణికులకు, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. శుక్రవారం ఈ రహదారిపై ఇసుక లారీల వలన రాకపోకలు బంద్ అయ్యాయి. కనీసం బైక్ వెళ్లేందుకు అవకాశం లేక గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా పోలీస్ లు స్పందించి ఇసుక ర్యాంప్ నిర్వాహకుల పైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.