SRCL: బోయినపల్లి మండలం తడగొండ బోయినపల్లి గ్రామ శివారులలో గురువారం ఎస్సై రమాకాంత్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, వాహన పత్రాలు, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్లను పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.