VSP: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి , ఆమె కంపెనీ అవ్యాన్ రియల్టర్స్ ఎల్ఎల్పీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గురువారం షాక్ ఇచ్చింది. సీఆర్జెడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ భీమిలి పరిధిలో సముద్రానికి దగ్గరగా నిర్మించిన కాంక్రీట్ గోడను కూల్చివేసిన ఖర్చు రూ. 48.21 లక్షలను జీవీఎంసీ వద్ద జమ చేయాలని హైకోర్టు నేహారెడ్డిని ఆదేశించింది.