»Warning To Telugu States Chance Of Thunder In These Districts
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు హెచ్చరిక.. ఈ జిల్లాల్లో పిడుగులకు ఛాన్స్
తెలుగు రాష్ట్రాల(Telugu States)కు వర్షాల ముప్పు పొంచి ఉంది. మరో మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు(Rain) పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ(Weather Department) తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
తెలుగు రాష్ట్రాల(Telugu States)కు వర్షాల ముప్పు పొంచి ఉంది. మరో మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు(Rain) పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ(Weather Department) తెలిపింది. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని, ఇంకొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ(AP Weather Department) వెల్లడించింది. విదర్భ నుంచి తమిళనాడు వరకూ తెలంగాణ, కర్ణాటక మీదుగ ద్రోణి కొనసాగుతోందని, దాని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్(Andhrapradesh)లోని మన్యం, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, సత్యసాయి,అనంతపురం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. పిడుగులు పడే అవకాశం ఉండటంతో రైతులు, కూలీలు, గొర్రె కాపరులు జాగ్రత్తగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ(AP Weather Department) వెల్లడించింది.
తెలంగాణ(Telangana)లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ(Hyderabad Weather Department) వెల్లడించింది. ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని సూచించింది.