వంట గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. గృహవినియోగ LPG సిలిండర్ ధర రూ.60, కమర్షియల్ వాణిజ్య సిలిండర్ ధర రూ.115 పెరిగింది. హైదరాబాద్లో LPG సిలిండర్ ధర రూ.965కు చేరింది. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. ఉజ్వల పథకం ద్వారా అందించే సిలిండర్ ధరలు యథాతథం.