ఇజ్రాయెల్‌తో శాంతి ఒప్పందాన్ని హమాస్ సైతం ధ్రువీకరించింది. గాజాలో యుద్ధానికి ముగింపు పలికేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందని చెప్పింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఖతార్, ఈజిప్టు, టర్కీకు హమాస్ కృతజ్ఞతలు తెలిపింది. గాజా ప్రజలు సాటిలేని ధైర్యం, వీరత్వం ప్రదర్శించారని చెప్పింది. స్వేచ్ఛ, స్వాతంత్ర్యం సాధించేవరకు తమ ప్రజల హక్కులను వదులుకోమని హమాస్ పేర్కొంది.