ఓట్స్‌లో విటమిన్లు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఓట్స్‌ను తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండె జబ్బులు దూరమవుతాయి. బరువు అదుపులో ఉంటుంది. రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయి కంట్రోల్లో ఉంటాయి.