న్యాయవాదిగా, జ్యుడీషియల్ అధికారిగా మొత్తం ఏడేళ్ల అనుభవం ఉన్నవారు కూడా జిల్లా జడ్జి పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. కింది కోర్టుల జడ్జీలుగా పనిచేస్తున్నవారు కూడా బార్ కోటా కింద జిల్లా జడ్జి నియామకానికి అర్హులే అని స్పష్టం చేసింది.