MBNR: జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల అభ్యర్థుల నామినేషన్ స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాధా రోహిణి తెలిపారు. ఇవాళ రాజపూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో జడ్పీటీసీ నామినేషన్ అభ్యర్థుల స్వీకరణకు ఏర్పాట్లు చేసినట్లు ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విజయలక్ష్మి, ఎస్సై శివానంద గౌడ్ పాల్గొన్నారు.