KNR: స్వగ్రామం హుజూరాబాద్ మండలం కాట్రపల్లికి దసరా సెలవులకు వచ్చిన సీఆర్పీఎఫ్ జవాన్ పెరమండ్ల రాజ్ కుమార్ (38) తీవ్ర మానసిక ఒత్తిడితో బుధవారం ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నారు. నిద్ర పట్టడంలేదని, తన చావుకు ఎవరూ కారణం కాదని పేర్కొంటూ ఆయన ఒక లేఖ రాశారు. రాజ్ కుమార్ మరణంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.