గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న ‘పెద్ది’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇవాళ్టి నుంచి పూణేలో ఓ పాటతో కొత్త షెడ్యూల్ మొదలుకానుంది. మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ అద్భుతమైన గీతాన్ని సిద్ధం చేశారని, ఆ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేయనున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఈ సాంగ్ భారీగా విజువల్ హంగులతో తెరకెక్కనుందని పేర్కొన్నాయి.