SRPT: ముత్తూట్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో హుజూర్ నగర్ పట్టణానికి చెందిన మరికంటి సంకీర్తనకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కింద 30 వేల రూపాయల చెక్కును ఆమె ఉన్నత విద్య కోసం అందజేసినట్లు మేనేజర్ పాలేలి నరేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డ్ కౌన్సిలర్ అట్లూరి మంజుల హరిబాబు మాట్లాడుతూ.. ముత్తూట్ ఫైనాన్స్ సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు.