KNR: ప్రధాన మంత్రి జాతీయ అప్రెంటిషిప్ మేళాలో భాగంగా ఈనెల 13న కరీంనగర్ ఉజ్వల పార్క్ పక్కనున్న ప్రభుత్వ ఐటీఐలో అప్రెంటిషిప్ మేళా నిర్వహిస్తున్నట్లు ఐటీఐ ప్రిన్సిపల్ కె.అశోక్ కుమార్ తెలిపారు. ఎలక్ట్రిషన్, పిట్టర్, మెకానిక్ డీజిల్, సీడీపీఏ ట్రేడ్లలో ఐటీఐ పాసైన అభ్యర్థులు అర్హత పత్రాలు, బయోడేటా, జిరాక్స్ కాపీలతో హాజరు కావాలని సూచించారు.