శ్రీకాకుళం జిల్లాలో రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం రూ. 40.23 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లాలో మొత్తం 101.15 కిలో మీటర్ల మేర గుంతలు లేని రోడ్ల మరమ్మతులు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ఆర్అండ్బి, ప్రధాన, జాతీయ రహదారులు మెరుగుపడనున్నాయి.