అన్నమయ్య: బి. కొత్తకోటలో రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన విక్రమ్ సింగ్ (26) అనే యువకుడు ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం కారణంగా బుధవారం రాత్రి ఉరేసుకుని మృతి చెందాడు. రాజస్థాన్లోని బాలహోత్ర జిల్లా, శివన గ్రామానికి చెందిన విక్రమ్ సింగ్, స్థానిక పోకనాటి వీధిలో ఓ సేటు నిర్వహించే గిఫ్ట్ సెంటర్లో పనిచేస్తున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు.