ప్రకాశం: కనిగిరి మున్సిపాలిటీలోని కనకపట్నం ప్రాంతానికి చెందిన గ్రామ సచివాలయ ఉద్యోగి మండా నరేంద్ర, రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లారు. చికిత్సకు అప్పులు చేసినా కోలుకోకపోవడంతో, అతని భార్య తేజశ్రీ ఇద్దరు పిల్లలతో కలిసి ఆదుకోవాలని వేడుకున్నారు. దీనిపై స్పందించిన కనిగిరి మానవతా సంస్థ సభ్యులు బుధవారం బాధితుడిని పరామర్శించి, రూ.77వేల నగదును అందజేశారు.